Raviteja: మలయాళ సినిమా రీమేక్ లో రవితేజ?

Raviteja in Malayalam movie remake
  • తెలుగులో మలయాళ సినిమాల రీమేక్ ల జోరు 
  • ఇప్పటికే రీమేక్ లలో పవన్, వెంకటేశ్, చిరంజీవి
  • రామ్ చరణ్ వద్ద 'డ్రైవింగ్ లైసెన్స్' హక్కులు    
  • రవితేజతో రీమేక్ చేసే ఆలోచనలో చరణ్  
తెలుగునాట ఇప్పుడు మలయాళ సినిమాల రీమేక్ ల జోరు కనపడుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ హీరోగా 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం రీమేక్ అవుతుండగా.. మరోపక్క ఇటీవల మలయాళంలో హిట్టయిన 'దృశ్యం 2' చిత్రాన్ని వెంకటేశ్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. అలాగే, మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'లో చిరంజీవి హీరోగా నటించనుండగా, మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహించనున్నారు.

ఈ క్రమంలో మరో స్టార్ హీరో రవితేజ కూడా ఓ మలయాళ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో మలయాళంలో వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో మెగా హీరో రామ్ చరణ్ ఆ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఇందులో ఆయన నటిస్తాడని కూడా వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఇప్పుడీ చిత్రాన్ని రవితేజ హీరోగా రీమేక్ చేయాలని చరణ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒరిజినల్ వెర్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను రవితేజ చేస్తాడనీ, మరొక హీరోగా విజయ్ సేతుపతి నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.
Raviteja
Vijay Setupati
Pawan Kalyan
Venkatesh Daggubati

More Telugu News