Tanzania: టాంజానియా తొలి మహిళా అధ్యక్షురాలిగా సులుహు హసన్

  • అధ్యక్షురాలిగా 61 ఏళ్ల సులుహు ప్రమాణస్వీకారం
  • సామాన్యురాలు అధ్యక్షురాలిగా ఎదిగిన వైనం
  • రాజకీయాల్లో ఆమెది 20 ఏళ్ల ప్రస్థానం
Tanzanias Samia Suluhu Hassan Sworn In As First Female President

ఆఫ్రికా దేశం టాంజానియాలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా సామియా సులుహు హాసన్ పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న జాన్ మగుఫులి అనారోగ్యంతో హఠాన్మరణం చెందడంతో... సులుహు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా 61 ఏళ్ల సులుహు నల్ల రంగు కోటు, ఎరుపు రంగు స్కార్ఫ్ ధరించారు. 'సామియా సులుహు హాసన్ అనే నేను టాంజానియా రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను' అంటూ ఆమె ప్రమాణస్వీకారం చేశారు. 2025 వరకు ఆమె అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారు. రాజకీయాల్లో ఆమెది 20 ఏళ్ల ప్రస్థానం. ఒక చిన్న నాయకురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె... అంచెలంచెలుగా ఎదుగుతూ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.

More Telugu News