Petrol: 20 రోజులుగా పెరగని ధరలు.. చమురు సంస్థలకు నష్టాలు!

  • పెట్రోల్ పై లీటర్ కు రూ.4, డీజిల్ పై రూ.2 నష్టం
  • ఫిబ్రవరి 17 నుంచి జరగని రోజువారీ ధరల సమీక్ష
  • చమురు సగటు ధర ఎక్కువగా ఉండడం వల్లేనంటున్న అధికారులు
  • గ్యాస్ సిలిండర్ విషయంలోనూ ఇదే పరిస్థితి
Oil companies lose Rs 4 on petrol Rs 2 on diesel due to price freeze

కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. ఈ విషయంపై ఇటు ప్రజలు, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, నిరసనలు ఎదురయ్యాయి. అయితే, ఎన్నికలు కావొచ్చు లేదా వేరే కారణమేదైనా అయి ఉండొచ్చు.. ఫిబ్రవరి 17 నుంచి 20 రోజులుగా పెట్రో ధరల రోజువారీ సమీక్ష జరగలేదు. వాటి ధరలు పెరగలేదు.

దీని వల్ల చమురు సంస్థలకు నష్టం కలుగుతున్నట్టు చమురు ధరలను సమీక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు. పెట్రోల్ పై లీటరుకు రూ.4, డీజిల్ పై లీటర్ కు రూ.2 చొప్పున చమురు సంస్థలకు నష్టం వాటిల్లుతోందని అంటున్నారు.

‘‘ముడి చమురు ధరలకు సంబంధించి పక్షం రోజుల సగటును చమురు సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రస్తుతమున్న సగటు ధర చమురు సంస్థలకు భారంగానే ఉంది. బ్రెంట్ ముడి చమురు ధర బుధవారం నుంచి కొంత తగ్గుతున్నా.. మొత్తంగా అయితే ఎక్కువే ఉంది. దీంతో పెట్రోల్ పై లీటరుకు రూ.4, డీజిల్ పై రూ.2 చొప్పున సంస్థలు నష్టపోతున్నాయి. ఇంట్లో వాడే గ్యాస్ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది’’ అని ఓ సీనియర్ అధికారి చెప్పారు.

More Telugu News