Chris Gayle: భార‌త్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో విడు‌దల చేసిన క్రిస్ గేల్

 cricketer Chris Gayle thanks India
  • జ‌మైకాకు భార‌త్ క‌రోనా వ్యాక్సిన్లు
  • మోదీతో, భార‌త‌ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతోన్న ప్ర‌ముఖులు
  • క్రిస్ గేల్ ప్ర‌శంసలు
క‌రోనాకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తోన్న భార‌త్.. ప‌లు దేశాల‌కు వాటిని పంపి ఆదుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌త్‌కు ప‌లు దేశాల ప్ర‌ముఖులు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌మైకాకు భార‌త్ క‌రోనా వ్యాక్సిన్ల‌ను పంప‌డంతో వెస్టిండీస్ క్రికెట‌ర్ క్రిస్ గేల్ దీనిపై స్పందిస్తూ ఓ వీడియో రూపంలో మాట్లాడాడు.

ప్ర‌ధాన మంత్రి మోదీతో పాటు భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నానని ఆయ‌న చెప్పాడు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు భార‌త్ చేప‌డుతున్న ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న ప్ర‌శంసించాడు. ఇటీవ‌ల వెస్టిండీస్‌కు చెందిన‌ కొంద‌రు మాజీ క్రికెట‌ర్లు కూడా భార‌త్‌కు కృజ్ఞ‌త‌లు చెప్పారు.
Chris Gayle
West indies
India

More Telugu News