Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samanta hikes her fee
  • పారితోషికాన్ని పెంచేసిన సమంత?
  • దిల్ రాజు బ్యానర్లో నవీన్ పోలిశెట్టి
  • కృష్ణవంశీ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్  
*  ఓపక్క ఇతర హీరోయిన్లు తమ పారితోషికాన్ని పెంచేస్తుండడంతో, కథానాయిక సమంత కూడా తాజాగా తన పారితోషికాన్ని 3 కోట్లకు పెంచినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' చిత్రంలో నటిస్తున్న సమంత.. దీని తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనుంది.
*  'జాతిరత్నాలు' సూపర్ హిట్టవ్వడంతో అందులో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టికి క్రేజ్ పెరిగిపోయింది. పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా అతనితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని, ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి, అతని డేట్స్ లాక్ చేశాడనీ తెలుస్తోంది.
*  ప్రస్తుతం 'రంగమార్తాండ' చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన తదుపరి చిత్రం కోసం 'అన్నం' టైటిల్ని ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో నటించే హీరో హీరోయిన్లు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. అయితే, దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తాడని వార్తలొస్తున్నాయి.  
Samanta
Naveen Polishetty
Krishna Vamshi
AR Rehman

More Telugu News