దేవాన్ష్ పేరిట శ్రీవారి అన్నదానం ట్రస్టుకు చంద్రబాబు కుటుంబం భారీ విరాళం

18-03-2021 Thu 16:38
  • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా భారీ విరాళం
  • అన్నదానం ట్రస్టుకి రూ. 30 లక్షల విరాళం
  • ఈ నెల 21న దేవాన్ష్ పుట్టినరోజు
Chandrababu family donation to TTD Annadanam Trust

టీడీపీ అధినేత చంద్రబాబుకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిపై ఎంతో భక్తిభావం ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఎన్నోసార్లు ఆయన శ్రీవారిని దర్శించుకుంటుంటారు. తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజున కుటుంబ సమేతంగా వెంకన్నను ఆయన దర్శనం చేసుకుంటున్నారు. ఈ నెల 21న దేశాన్ష్ పుట్టినరోజు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు తన కుటుంబంతో కలిసి వెంకన్నను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా తిరుమల అన్నదానం ట్రస్టుకి రూ. 30 లక్షల విరాళం అందించనున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా అన్నదానానికి చంద్రబాబు కుటుంబం విరాళం ఇస్తున్న సంగతి తెలిసిందే.