Jayachitra: రూ. 26 కోట్ల మోసం కేసులో సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అరెస్ట్!

  • రైస్ పుల్లింగ్ కలశం పేరుతో జయచిత్ర కుమారుడు అమ్రేష్ మోసం
  • నెడుమారన్ ను రూ. 26 కోట్ల మేర మోసం చేసిన వైనం
  • అమ్రేష్ ను అరెస్ట్ చేసిన సీబీసీఐడీ
Jayachitra son arrested in rice pulling cheating

సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్ ను చెన్నై పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ వస్తువు ఉందని నమ్మబలికి చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ ను రూ. 26 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను చెన్నై పోలీసులు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం... అమ్రేష్, అతని స్నేహితులు 2013 నుంచి నెడుమారన్ ను మోసం చేస్తూ వస్తున్నారు. మాయ మాటలు చెపుతూ అతని వద్ద నుంచి డబ్బులు కాజేస్తున్నారు. తమ వద్ద రైస్ పుల్లింగ్ కలశం ఉందని... దీనితో జీవితం మారిపోతుందని అతన్ని నమ్మించారు. దీంతో, పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆ కలశాన్ని నెడుమారన్ తీసుకున్నారు. కొంత కాలం పాటు తన ఇంట్లో ఆ కలశాన్ని ఆయన ఉంచుకున్నారు. ఆ తర్వాత దాని వల్ల ఉపయోగం లేదని ఆయన గ్రహించారు. అమ్రేష్ తనను మోసం చేశాడని భావించిన నెడుమారన్... సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి ఫిర్యాదు చేశారు.

నెడుమారన్ ఫిర్యాదు మేరకు అమ్రేష్ ను, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్మూరులోని సీబీసీఐడీ కోర్టులో అతడిని ప్రవేశపెట్టారు. కోర్టు అమ్రేష్ ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. మరోవైపు పలు తమిళ చిత్రాల్లో అమ్రేష్ నటించాడు. కొన్ని చిత్రాలకు పాటలు కూడా కంపోజ్ చేశారు.

More Telugu News