AmazonPrime: నిర్మాత అవతారం ఎత్తిన అమెజాన్

Amazon Prime co produce Akshay Kumar starring Ram Setu
  • అక్షయ్ కుమార్ హీరోగా 'రామ్ సేతు'
  • సహ నిర్మాతగా అమెజాన్ ప్రైమ్
  • ఎంతో ఉద్విగ్నంగా ఉందంటూ ట్వీట్
  • తరాల మధ్య వారధి లాంటి చిత్రమని వ్యాఖ్య 
భారత్ లోని బడా సంస్థలు, చిల్లర దుకాణాల వ్యాపారాన్ని గణనీయస్థాయిలో ప్రభావితం చేస్తున్న అమెజాన్ ఇప్పుడు మరో అవతారం ఎత్తింది. ఓటీటీ వేదికలపై అమెజాన్ ప్రైమ్ పేరిట డిజిటల్ కంటెంట్ ను అందిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలో కాలుమోపుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రానున్న 'రామ్ సేతు' చిత్రానికి సహ నిర్మాతగా అమెజాన్ ప్రైమ్ వ్యవహరించనుంది.

ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఇండియా విభాగం ట్విట్టర్ లో వెల్లడించింది. సహ భాగస్వామ్యంలో తొలి ప్రొడక్షన్ గురించి ప్రకటించడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది అని ట్వీట్ చేసింది. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి తారలతో తెరకెక్కనున్న 'రామ్ సేతు' చిత్రం భిన్న కాలాలకు చెందిన తరాల మధ్య వారధి లాంటిదని అమెజాన్ ప్రైమ్ అభివర్ణించింది.

కాగా ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ కు చెందిన కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. అబండాంటియా ప్రొడక్షన్స్, లైకా ప్రొడక్షన్స్ లు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు కాగా, వీటి సరసన అమెజాన్ ప్రైమ్ కూడా చేరింది.
AmazonPrime
Ram Setu
Co Production
Akshy Kumar
Bollywood

More Telugu News