Tirath Singh Rawat: యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

Uttarakhand CM sensation comments on women dressing
  • ఎన్జీవో నడుపుతున్న ఓ యువతి చిరిగిన జీన్స్ ధరించడం చూసి షాకయ్యాను
  • వస్త్రధారణ ఎలా ఉండాలనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుంది
  • మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు
యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతులు మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమేనని ఆయన అన్నారు. పాశ్చాత్య దేశాల ప్రజలు మన దేశ సంస్కృతిని అనుసరిస్తూ పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటూ యోగా చేస్తుంటే... మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని చెప్పారు. ఒక ఎన్జీవోను నడుపుతున్న ఓ యువతి చిరిగిన జీన్స్ ను ధరించడాన్ని చూసి తాను షాకయ్యానని అన్నారు. అలాంటి వస్త్రధారణతో ప్రజలను కలవడానికి ఆమె వెళ్తే... ఈ సమాజానికి ఆమె ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టని ప్రశ్నించారు.

వస్త్రధారణ ఎలా ఉండాలనేది మన ఇంటి నుంచే ప్రారంభమవుతుందని రావత్ అన్నారు. మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారని చెప్పారు. మన దేశ సంస్కృతి మూలాలను పిల్లలకు ఇంట్లో నేర్పించాలని... అప్పుడు వారు ఎంత ఆధునికంగా ఉన్నా సమస్య ఉండదని... జీవితంలో వారు వైఫల్యం చెందరని అన్నారు. శరీరం కనిపించే వస్త్రధారణ వల్ల లైంగిక వేధింపులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు.
Tirath Singh Rawat
Uttarakhand
Women
Dressing

More Telugu News