Sensex: 562 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

  • అమ్మకాల ఒత్తిడికి గురైన దిగ్గజ కంపెనీలు
  • 189 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4.91 శాతం నష్టపోయిన ఓఎన్జీసీ షేర్
Sensex loses 562 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏసియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, భారతి ఎయిర్ టెల్ వంటి దిగ్గజ కంపెనీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 562 పాయింట్ల నష్టంతో 49,801కి పడిపోయింది. నిఫ్టీ 189 పాయింట్లు కోల్పోయి 14,721కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను చవిచూశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (4.91%), ఎన్టీపీసీ (3.01%), సన్ ఫార్మా (3.28%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.08%), బజాజ్ ఆటో (2.57%).      

సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (-1.30%), ఇన్ఫోసిస్ (-0.14%) మాత్రమే లాభపడ్డాయి.

More Telugu News