Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇల్లు, బంధువుల ఇళ్లల్లో సీఐడీ సోదాలు

CID conducting raids in TDP leader Narayana and his relatives houses
  • నారాయణ, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు
  • నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ లలో సోదాలు
  • ఏక కాలంలో కొనసాగుతున్న సోదాలు
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణకు చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇన్ని చోట్ల ఒకేసారి సోదాలు జరుగుతుండటం సంచలనంగా మారింది.

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణకు సీఐడీ అధికారులు నిన్న నోటీసులు అందజేశారు. ఈ నెల 23న విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు జరుపుతోంది.
Narayana
Telugudesam
CID
Raids

More Telugu News