Naga Chaitanya: ఆమిర్ ఖాన్ సినిమాలో అక్కినేని హీరో!

Naga Chaitanya to play key role in Amir Khans film
  • తొలిసారిగా హిందీ సినిమాలో నాగ చైతన్య
  • ఆమిర్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా
  • హాలీవుడ్ సినిమా 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్ 
  • కీలక పాత్రకు నాగ చైతన్య ఎంపిక    
యువ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్య తండ్రి నాగార్జున బాటలో పయనిస్తున్నాడు. నాగార్జున తన కెరీర్ మొదటి నుంచీ ఇటు తెలుగు సినిమాలలో  నటిస్తూనే అప్పుడప్పుడు హిందీ సినిమాలలో కూడా నటిస్తూ అక్కడ కూడా తన ముద్రను వేస్తున్నారు. ఇప్పుడు చైతన్య కూడా తండ్రి బాటపడుతున్నాడు. తొలిసారిగా ఓ హిందీ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ సినిమాలో కావడం మరో విశేషం!

ఆమిర్ ఖాన్ హీరోగా 'లాల్ సింగ్ చద్దా' పేరుతో ప్రస్తుతం ఓ హిందీ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వచ్చిన హాలీవుడ్ హిట్ సినిమా 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రకు మొదట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే, కారణాంతరాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఇప్పుడు నాగ చైతన్యని సంప్రదించారని, ఆయన కూడా దీనికి ఓకే చెప్పాడనీ అంటున్నారు.
Naga Chaitanya
Amir Khan
Nagarjuna

More Telugu News