metro: హైద‌రాబాద్‌ మెట్రోలో నిబంధ‌న‌లు తెలియ‌క.. జరిమానా చెల్లించుకుంటోన్న ప్ర‌యాణికులు

  • కేపీహెచ్బీ కాల‌నీ నుంచి నాగోలుకు ఓ కుటుంబం ప్ర‌యాణం
  • స్త్రీల‌కు కేటాయించిన సీట్ల‌లో కూర్చున్న వైనం
  • ఈఎస్ఐ స్టేష‌న్ వ‌ద్ద దించేసిన మెట్రో సిబ్బంది
  • రూ.600 జ‌రిమానా విధించిన వైనం  
family members pay fine in metro

హైద‌రాబాద్‌ మెట్రోలో ప్రయాణించే స‌మ‌యంలో ప‌లు నిబంధ‌న‌ల గురించి ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, కూక‌ట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డు కాల‌నీ నుంచి నాగోలు వెళ్లేందుకు ఓ కుటుంబ స‌భ్యులు మెట్రో రైలు ఎక్కారు. అయితే, జనరల్‌ కోచ్‌లలో సీట్లు ఖాళీ లేక‌పోవ‌డంతో వారు స్త్రీల‌కు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. ఈ విష‌యాన్ని గుర్తించిన పోలీసులు, మెట్రో సిబ్బంది.. ఈఎస్ఐ స్టేషన్‌లో వారిని కోచ్‌ నుంచి బయటకు దించారు.

ఆ కుటుంబంలోని మొత్తం ఆరుగురు.. స్త్రీల‌కు కేటాయించిన సీట్ల‌లో కూర్చోవ‌డంతో  వారందరికీ క‌లిపి రూ.600 జరిమానా వేశారు. మ‌హిళ‌ల సీట్ల‌లో కూర్చోకూడ‌ద‌ని త‌మ‌కు తెలియ‌ద‌ని, తాము గుంటూరు నుంచి ప‌నిమీద‌ హైద‌రాబాద్‌కు వ‌చ్చి స‌ర‌దాగా మెట్రో రైలు ఎక్కామ‌ని ఆ కుటుంబ స‌భ్యులు వాపోయారు. ఆ సీట్ల‌న్నీ ఖాళీగానే ఉన్నాయ‌ని, తాము కూర్చున్న త‌ర్వాత ప్ర‌యాణికులు ఎవ్వ‌రూ అభ్యంత‌రాలు కూడా చెప్ప‌లేద‌ని తెలిపారు. చివ‌ర‌కు రూ.600 చెల్లించి మరో మెట్రో రైలులో వారు నాగోలుకు వెళ్లారు.

More Telugu News