Chandrababu: సీఐడీ నోటీసులపై రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్న చంద్రబాబు!

Chandrababu decides to go high court on cid notices
  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు
  • చంద్రబాబు, నారాయణలకు నోటీసులు
  • ఈ నెల 23న విచారణకు రావాలని స్పష్టీకరణ
  • న్యాయ సలహాలు తీసుకున్న చంద్రబాబు
  • సీఐడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం
అమరావతిలో భూ దందా జరిగిందని, చంద్రబాబు హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చోటుచేసుకుందన్న ఆరోపణలపై నిన్న సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ నోటీసుల అంశంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు... రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ లో కోరనున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబు, మాజీమంత్రి నారాయణలకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 (ఏ) సీఆర్పీసీతో పాటు ఎఫ్ఐఆర్ ప్రతిని కూడా సీఐడీ పోలీసులు చంద్రబాబు, నారాయణలకు అందజేశారు. చంద్రబాబుపై 120 బీ, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని, లేకపోతే అరెస్టు చేయాల్సి వుంటుందని  నోటీసుల్లో స్పష్టం చేశారు.
Chandrababu
CID Notice
AP High Court
Amaravati
Insider Trading

More Telugu News