Chandrababu: నేడు ఏలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

Chandrababu to visit Eluru on Wednesday
  • ఇటీవల టీడీపీ నేత మాగంటి బాబుకు పుత్ర వియోగం
  • పెద్ద కుమారుడు రాంజీ కన్నుమూత
  • మాగంటి బాబును పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయం
  • అనంతరం పార్టీ నేతలతో సమావేశం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు ఏలూరుకు వెళుతున్నారు. ఇటీవల పుత్ర వియోగం పొందిన టీడీపీ నేత మాగంటి బాబును ఆయన పరామర్శించనున్నారు. మాగంటి బాబు కుమారుడు రాంజీ ఇటీవల కన్నుమూశారు.

రాంజీ మాగంటి బాబు పెద్ద కుమారుడు. టీడీపీ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ తండ్రికి చేయూతగా నిలిచేవాడు. 37 ఏళ్ల రాంజీ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఏలూరులో చికిత్స అనంతరం విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. స్వగ్రామంలో రాంజీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాగంటి బాబు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

అనంతరం ఈ మధ్యాహ్నం ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలపై వారితో చర్చిస్తారు. పార్టీ బలోపేతంపై వారి అభిప్రాయాలు స్వీకరించనున్నారు.
Chandrababu
Eluru
Maganti Babu
Ramji
TDP

More Telugu News