England: టీమిండియాపై విజయంతో మరో రికార్డు సాధించిన ఇంగ్లండ్

England register another record after beating India in Ahmedabad
  • మూడో టీ20లో ఇంగ్లండ్ గెలుపు
  • అన్ని ఫార్మాట్లలో ఆ జట్టుకు భారత్ పై ఇది 99వ విజయం
  • విండీస్ తో కలిసి రెండోస్థానం
  • భారత్ పై అత్యధిక విజయాల జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానం
గత రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో టీమిండియాపై నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విజయం ఇంగ్లండ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్లో భారత్ పై 99వది. భారత్ పై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది.

వెస్టిండీస్ కూడా సరిగ్గా అన్నే విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆసీస్ జట్టు భారత్ పై ఇప్పటివరకు 132 విజయాలు నమోదు చేసింది.
England
India
Most Wins
West Indies
Australia
International Cricket

More Telugu News