England: ఇంగ్లండ్ ఆల్ రౌండ్ షో... మూడో టీ20లో టీమిండియా ఓటమి

  • 157 పరుగుల టార్గెట్ ను ఛేదించిన ఇంగ్లండ్
  • 8 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన వైనం
  • విరుచుకుపడిన జోస్ బట్లర్
  • సమష్టిగా విఫలమైన భారత జట్టు
  • 2-1తో సిరీస్ లో ఇంగ్లండ్ ముందంజ
England beat Team India in third match

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. 157 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. బట్లర్ కు తోడు జానీ బెయిర్ స్టో (40 నాటౌట్; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు.

టీమిండియా బౌలర్లలో చహల్, సుందర్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జాసన్ రాయ్ 9 పరుగులు చేయగా, డేవిడ్ మలాన్ 18 పరుగులకు అవుటయ్యాడు. అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్... టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఇంగ్లండ్ బౌలర్లు సమయోచితంగా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ మార్చి 18న అహ్మదాబాద్ లోనే జరగనుంది.

More Telugu News