కామారెడ్డి జిల్లా స్కూలులో 32 మందికి... నాగోల్ లో 36 మంది బాలికలకు కరోనా పాజిటివ్

16-03-2021 Tue 20:45
  • తెలంగాణ విద్యాసంస్థల్లో కరోనా కలకలం
  • టేక్రియాల్ కస్బూర్బా విద్యాలయంలో టీచర్లకూ కరోనా
  • కరోనా సోకిన విద్యార్థులకు హోమ్ క్వారంటైన్
  • ఆందోళన కలిగిస్తున్న కొత్త కేసుల సంఖ్య
Girl students tested corona positive in Telangana education institutions
తెలంగాణలో మరో విద్యాసంస్థలో కరోనా కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 32 మంది విద్యార్థినులకు కరోనా సోకినట్టు వెల్లడైంది. అయితే వైద్య పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్ వచ్చినా, వారిలో ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. ఆ బాలికలను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఇదే పాఠశాలలో ఆరుగురు టీచర్లు కూడా కరోనా బారినపడ్డారు.

అటు... హైదరాబాదు నాగోల్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 36 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడి కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దాంతో మిగిలిన విద్యార్థినులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.