Hari Nadar: ఒళ్లంతా బంగారం ధరించి ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి

Candidate wearing gold files nomination in Tamilnadu an eye turner
  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన హరి నాడార్
  • అలంగుళమ్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్
  • 5 కిలోల నగలు ధరించి నామినేషన్ వేసిన వైనం
  • 11.2 కిలోల బంగారం ఉందని అఫిడవిట్ లో వెల్లడి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్లో వెల్లడించే ఆస్తుల వివరాలు నిజమేనా..? అనే సందేహం దేశంలో ఇప్పటికీ ఓ చర్చనీయాంశమే! ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వచ్చిన విధానం చూస్తే కళ్లు జిగేల్మంటాయి. ఒళ్లంతా బంగారం ధరించి రాజఠీవి ఒలకబోసేలా అతగాడు నామినేషన్ వేయడం అందరినీ ఆకర్షించింది.

అతడి పేరి హరి నాడార్. తిరునల్వేలి జిల్లా అలంగుళమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. అయితే నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చిన హరి నాడార్ ను చూసి స్థానికులే కాదు, రిటర్నింగ్ అధికారులు సైతం కళ్లప్పగించి చూశారు. దాదాపు 5 కిలల బంగారు నగలు ధరించిన హరి నాడార్ ఎన్నికల అధికారుల కార్యాలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇక అఫిడవిట్లో తనకు 11.2 కిలోల బంగారం ఉందని పేర్కొన్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ గోల్డ్ మ్యాన్ కు సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నాయి.
Hari Nadar
Nomination
Gold
Alangulam
Tamilnadu Assembly Elections

More Telugu News