Budda Venkanna: లేని ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసం ఇన్ని పాట్లు ఎందుకు జగన్ రెడ్డి గారూ!: బుద్ధా వెంకన్న

Budda Venkanna comments on Insider trading issue
  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు
  • చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
  • దళిత భూములు కబ్జా చేసింది జగనేనని ఆరోపణ 
  • చంద్రబాబుపై ఎస్సీఎస్టీ కేసు వింతగా ఉందన్న బుద్ధా
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడంతో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. అసలు లేని ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసం ఇన్ని పాట్లు ఎందుకు జగన్ రెడ్డి గారూ! అంటూ ప్రశ్నించారు. ఇడుపులపాయలో దళితులకు చెందిన 700 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిన జగన్... చంద్రబాబుపై ఎస్సీఎస్టీ కేసు పెట్టడం వింతగా ఉందని పేర్కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు పెడితే ఎస్సీఎస్టీ కేసు పెట్టడం మరో వింత అని బుద్ధా వ్యాఖ్యానించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును టచ్ చేయడం మీ వల్ల కాదు అని స్పష్టం చేవారు.
Budda Venkanna
Insider Trading
Chandrababu
Jagan
Amaravati
Andhra Pradesh

More Telugu News