Varla Ramaiah: వివేకా హత్య కేసులో జగన్ ఇరుక్కునే అవకాశం ఉంది... అందుకే చంద్రబాబుకు నోటీసులు: వర్ల రామయ్య

  • చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
  • స్పందించిన వర్ల రామయ్య
  • ప్రజల దృష్టి మళ్లించేందుకే నోటీసులు అని స్పష్టీకరణ
  • వివేకా కేసులో త్వరలో ముద్దాయిని పట్టుకుంటారు 
  • జగన్ కు వణుకు పుట్టించే పనిలో సీబీఐ ఉందని వ్యాఖ్యలు
Varla Ramaiah responds to CID notices issue

అమరావతి భూముల అంశంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు పంపడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని, హాజరుకాకపోతే అరెస్ట్ తప్పదని సీఐడీ చంద్రబాబును హెచ్చరించడాన్ని వర్ల రామయ్య తీవ్రంగా ఆక్షేపించారు. పాలన చేపట్టిన రెండేళ్ల తర్వాత కళ్లు తెరిచి ఇప్పుడు నోటీసులు ఇస్తారా? అని మండిపడ్డారు.

త్వరలోనే జగన్, విజయసాయి బెయిళ్లు రద్దు కాబోతున్నాయని అన్నారు. సీఎం జగన్ వెన్నులో వణుకు పుట్టించే పనిలో సీబీఐ ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిని త్వరలోనే పట్టుకుంటారని, ఈ కేసులో జగన్ ఇరుక్కునే అవకాశం ఉందని వర్ల వివరించారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబుకు సీఐడీ ద్వారా నోటీసులు పంపారని ఆరోపించారు.

ఇడుపులపాయలో దళితులకు అన్యాయం చేసింది మీ కుటుంబమే అంటూ సీఎం జగన్ ను విమర్శించారు. అసైన్డ్ భూములను అధీనంలోకి తీసుకున్నది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. 690 ఎకరాల దళితుల భూములను సాగుచేశామని నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంగీకరించారని వెల్లడించారు.

More Telugu News