Amaravati: అమరావతి భూముల్లో అక్రమాలు.. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సీఐడీ

Amaravati land scam CID issue notices toChandrababu
  • ఉదయం చంద్రబాబు ఇంటికి చేరుకున్న సీఐడీ బృందం
  • విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు
  • 41వ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామన్న సీఐడీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ఈ ఉదయం చేరుకున్న అధికారులు రాజధాని భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటికి మొత్తం ఆరుగురు అధికారులు చేరుకున్నారు. భద్రతా సిబ్బందితో మాట్లాడి లోపలికి వెళ్లారు. 41వ సీఆర్‌పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామని, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.
Amaravati
Land Scam
Chandrababu
CID

More Telugu News