Narendra Modi: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ... సీఎంలతో సమావేశం కానున్న ప్రధాని మోదీ

PM Modi will meet Chief Ministers to discuss corona pandemic
  • అనేక రాష్ట్రాల్లో అధికమవుతున్న కొత్త కేసులు
  • ఈ నెల 17న సీఎంలతో మోదీ భేటీ
  • వర్చువల్ విధానంలో సమావేశం
  • కరోనా వ్యాప్తి, నివారణ, నియంత్రణ చర్యలపై చర్చ
దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 17న వర్చువల్ విధానంలో సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త కేసుల సంఖ్య వృద్ధి, కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై వారితో చర్చించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ పై సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్నారు. కాగా, కరోనా మళ్లీ తీవ్రతరం అవుతుండడంతో మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్, రాత్రివేళ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.
Narendra Modi
Prime Minister
Chief Ministers
Corona Virus
Pandemic
India

More Telugu News