Jaspreet Bumrah: ఓ ఇంటివాడైన టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా

Team India cricketer Jaspreet Bumrah ties the knot with sports anchor Sanjana Ganesan
  • స్పోర్ట్స్ యాంకర్ సంజనాతో ఘనంగా బుమ్రా పెళ్లి
  • బుమ్రాపై శుభాకాంక్షల జడివాన
  • ప్రేమ తమకు దారి చూపించిందన్న బుమ్రా
  • పెళ్లి ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్న వైనం
టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన మనసు దోచిన అమ్మాయిని పెళ్లాడాడు. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ తో బుమ్రా వివాహం నేడు ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను బుమ్రా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

"మీరు ప్రేమ విలువను గుర్తిస్తే మీరెటు వెళ్లాలో అదే నిర్ణయిస్తుంది. ప్రేమ మాకు చూపించిన దారిలో మేం నడిచాం... జంటగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఇది మా జీవితాల్లో ఒక అత్యంత సంతోషకరమైన దినాల్లో ఒకటి. మా పెళ్లి వార్తను మీతో పంచుకుంటున్నందుకు ధన్యులం అయ్యామనుకుంటున్నాం... ఇట్లు మీ బుమ్రా, సంజన" అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు.  

కాగా, ఓ ఇంటివాడైన బుమ్రాకు బీసీసీఐతో పాటు ఐసీసీ కూడా శుభాకాంక్షలు తెలిపింది. సహచర క్రికెటర్ల నుంచి కూడా కొత్తపెళ్లికొడుకు బుమ్రాకు భారీగా సందేశాలు వస్తున్నాయి.

బుమ్రా ప్రేమ, పెళ్లి గురించి గతంలో అనేక సార్లు పలు కథనాలు వెల్లువెత్తాయి. ఓ టాలీవుడ్ యువనటితో బుమ్రా ప్రేమయాణం అంటూ సోషల్ మీడియాలోనూ, న్యూస్ చానళ్లలోనూ ప్రముఖంగా వినిపించింది. అయితే, ఆ వార్తలను నటి కుటుంబ సభ్యులు ఇటీవలే కొట్టిపారేశారు. కానీ ఓ స్పోర్ట్స్ చానల్ లో ప్రజెంటర్ కమ్ యాంకర్ గా పనిచేస్తున్న సంజనా గణేశన్ తో బుమ్రా లవ్ ఎఫైర్ ను మాత్రం ఎవరూ పసిగట్టలేకపోయారు.
Jaspreet Bumrah
Sanjana Ganesan
Wedding
Team India
Sports Anchor

More Telugu News