Sikkim: 'చిరంజీవి అంకుల్ వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది'.. ఆసక్తిక‌ర విష‌యం చెప్పిన‌ మంచు ల‌క్ష్మి

lakshmi shares chiru monhan babu Sikkim trip pic
  • సిక్కిం టూర్‌కు మోహ‌న్ బాబును తీసుకెళ్లిన చిరు
  • చిరు, మోహ‌న్ బాబుల ఫొటో పోస్ట్ చేసిన ల‌క్ష్మి
  • ఏదో ఒక రోజు తాము కూడా జాయిన్‌ అవుతామని వ్యాఖ్య‌
మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు క‌లిసి సిక్కిం టూర్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని చెబుతూ మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇందులో చిరు, మోహ‌న్ బాబు చాలా స్టైల్ గా  ఉన్నారు. మేధావులు ఇద్ద‌రూ సిక్కిం ట్రిప్‌కు వెళ్తే ఎంత రచ్చ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని మంచు ల‌క్ష్మి ఈ సంద‌ర్భంగా పేర్కొంది.

'మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌ వీకెండ్‌ ట్రిప్‌కు నాన్నను దగ్గరుండి ఒప్పించి మరీ తీసుకెళ్లాడ'ని ఆమె చెప్పింది. ఈ విషయంలో త‌నకు కొంత ఈర్ష్యగా ఉందని తెలిపింది. అయితే, వారిద్దరూ హాయిగా ట్రిప్‌కు వెళ్లినందుకు సంతోషిస్తున్నాన‌ని చెప్పింది.

ఇటువంటి ట్రిప్‌లోనే ఏదో ఒక రోజు తాము కూడా జాయిన్‌ అవుతామని తెలిపింది. 'సిక్కింలో బిల్లారంగా' అంటూ మంచు మ‌నోజ్ కూడా చిరు, మోహ‌న్ బాబుల ఫొటోను పోస్ట్ చేశాడు.   
Sikkim
Viral Pics
Chiranjeevi
Mohan Babu

More Telugu News