Kodali Nani: టీఆర్ఎస్ కు పవన్ కల్యాణ్ మద్దతు పలకడంపై కొడాలి నాని స్పందన

  • టీడీపీకి దగ్గరయ్యేందుకు బీజేపీని దూరం పెట్టారు
  • తెలంగాణలో జనసేనకు బలం లేదు
  • ఏపీలో ప్రతి ఎన్నికలో చిత్తుగా ఓడిపోతోంది
Pawan Kalyan supported TRS in Telangana MLC polls to dump BJP says Kodali Nani

తెలంగాణ బీజేపీ నేతల వ్యవహారశైలిపై నిన్న పవన్ కల్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ కోసం జనసేన తెలంగాణలో త్యాగాలు చేసినప్పటికీ... ఆ పార్టీ నేతలు మాత్రం జనసైనికులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. తెలంగాణ జనసైనికుల విన్నపం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవికి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. పవన్ చేసిన ఈ ప్రకటన రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపింది.

ఈ సందర్భంగా ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేందుకే పవన్ కల్యాణ్ బీజేపీని దూరం పెట్టారని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో జనసేనకు ఎలాంటి బలం లేదని చెప్పారు. ఏపీలో ప్రతి ఎన్నికలో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోతోందని ఎద్దేవా చేశారు. గతంలో వామపక్షాలు, బీఎస్పీని పవన్ దూరం పెట్టారని...  ఇప్పుడు బీజేపీ వంతు వచ్చిందని అన్నారు.

More Telugu News