DMDK: తమిళనాట కొత్త భాగస్వామితో జట్టుకట్టిన విజయకాంత్ పార్టీ

DMDK makes alliance with AMMK in Tamilandu assembly polls
  • తమిళనాడులో కొత్త పొత్తులు
  • ఇటీవల అన్నాడీఎంకే నుంచి విడిపోయిన డీఎండీకే
  • ఏఎంఎంకే పార్టీతో భాగస్వామ్యం
  • 60 స్థానాల్లో బరిలో దిగనున్న విజయకాంత్ పార్టీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తుల పర్వం ఊపందుకుంది. సీట్ల పంపకం కుదరక ఇటీవల అన్నాడీఎంకే నుంచి విడిపోయిన నటుడు విజయకాంత్ పార్టీ డీఎండీకే... తాజాగా మరో భాగస్వామిని వెదుక్కుంది. టీటీవీ దినకరన్ కు చెందిన అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) పార్టీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకుంది. ఏఎంఎంకేతో పొత్తులో భాగంగా విజయకాంత్ పార్టీ 60 స్థానాల్లో పోటీ చేయనుంది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే.

కాగా పొత్తు కుదిరిన నేపథ్యంలో.... డీఎండీకే పార్టీకి కేటాయించిన స్థానాల్లో తమ అభ్యర్థులను ఉపసంహరించుకుంటున్నట్టు ఏఎంఎంకే ఓ ప్రకటన చేసింది. ఈ క్రమంలో డీఎండీకే నుంచి తొలిజాబితా విడుదలైంది. నటుడు విజయకాంత్ అర్ధాంగి ప్రేమలత విరుదాచలం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు.
DMDK
AMMK
Vijayakanth
TTV Dinakaran
Tamilnadu
Assembly Polls

More Telugu News