India: విదేశీ మారకద్రవ్యం నిల్వల్లో రష్యాను అధిగమించిన భారత్

  • ఆర్థిక శక్తిగా భారత్
  • గణనీయంగా బలపడిన విదేశీ మారకద్రవ్యం
  • ఇటీవల కాలంలో 4.3 బిలియన్ డాలర్ల తరుగుదల
  • అయినప్పటికీ రష్యాను దాటేసిన భారత్
  • ప్రపంచంలో నాలుగోస్థానానికి ఎగబాకిన భారత్
India surpasses Russia in forex reserves

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ ఆ దిశగా మరో కీలక పరిణామం నమోదు చేసింది. విదేశీ మారకద్రవ్యం నిల్వల్లో రష్యాను అధిగమించింది. తద్వారా ప్రపంచంలో అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం కలిగివున్న దేశాల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకింది. మార్చి 5 నాటికి విదేశీ మారక నిల్వల్లో 4.3 బిలియన్ డాలర్ల మేర తరుగుదల నమోదైనప్పటికీ... 580.3 బిలియన్ డాలర్లతో రష్యా (580.1 బిలియన్ డాలర్లు)ను అధిగమించింది.

అత్యధిక విదేశీ మారకద్రవ్యం నిల్వలతో చైనా అగ్రస్థానంలో ఉండగా, జపాన్, స్విట్జర్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ వద్ద భారీస్థాయిలో విదేశీ  మారకద్రవ్యం నిల్వలు ఉన్న అంశం విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచుతుందని, అంతర్జాతీయ స్థాయిలో రుణాలు పొందేందుకు వీలు కల్పించే క్రెడిట్ రేటింగ్ కంపెనీలు కూడా సంతృప్తి చెందుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News