Mamata Banerjee: గాయపడిన పులి ఎంత ప్రమాదకరమో ఇక చూస్తారు: వీల్ చైర్లో మమత ప్రచారం

Mamata Banarjee says wounded tiger becomes very dangerous
  • ఇటీవల తనపై దాడి జరిగిందంటూ మమత వెల్లడి
  • వీల్ చెయిర్ లోనే ప్రచారం
  • రాష్ట్రమంతటా ఇలాగే ప్రచారం చేస్తానన్న మమత
  • ఇలాంటివి ఎన్నో దాడులు చూశానని వివరణ
  • ఎవరి ముందూ తలవంచలేదని స్పష్టీకరణ
ఇటీవల తనపై దాడి జరిగిందంటూ వెల్లడించి సంచలనం రేపిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం వీల్ చెయిర్ లో కూర్చునే ప్రచారంలో పాల్గొంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో పోరాటం నెలకొంది.

ఈ నేపథ్యంలో, ప్రచార పర్వాన్ని ఉద్ధృతం చేసిన సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, గాయపడిన పులి ఎంత ప్రమాదకరమో ఇక చూస్తారని ప్రత్యర్థులను హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నానని, కానీ ఎవరి ముందు తల వంచలేదని స్పష్టం చేశారు. ఇకపై తాను వీల్ చెయిర్ లోనే బెంగాల్ మొత్తం ప్రచారంలో పాల్గొంటానని ఆమె వెల్లడించారు.

ప్రజలు తమకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని వారికి భరోసా ఇస్తామని పేర్కొన్నారు. బెంగాల్ కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలన్నింటిని తుత్తునియలు చేస్తామని అన్నారు.
Mamata Banerjee
Tiger
Wound
Wheel Chair
West Bengal

More Telugu News