Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్' నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్

Alia Bhat first look from RRR will be out on Monday
  • రాజమౌళి డైరెక్షన్లో 'ఆర్ఆర్ఆర్'
  • హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ 
  • సీత పాత్ర పోషిస్తున్న అలియా భట్
  • 'ఆర్ఆర్ఆర్' లో రామ్ చరణ్ కు జోడీ
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అలియా ఫస్ట్ లుక్ ను మార్చి 15న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

"దివ్యతేజస్సుతో అలరారే మా సీత వస్తోంది... చూడండి" అంటూ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ట్వీట్ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించింది.
Alia Bhatt
First Look
RRR
Rajamouli
Ramcharan
Junior NTR
Tollywood

More Telugu News