China: మాస్కో ఒప్పందానికి కట్టుబడాల్సిందే: భారత్​–చైనా నిర్ణయం

  • ఏడో రౌండ్ దౌత్య చర్చల్లో సత్ఫలితాలు
  • వాస్తవాధీన రేఖ వెంట బలగాల ఉపసంహరణ
  • త్వరలోనే 11వ రౌండ్ సీనియర్ కమాండర్ స్థాయి చర్చలు
  • పరస్పర ఆమోద పరిష్కారం వచ్చే వరకు చర్చలు
Breakthrough eludes 7th round of China talks

వాస్తవాధీన రేఖ వెంబడి పూర్తిగా బలగాల ఉప సంహరణపై భారత్–చైనా మధ్య జరుగుతున్న ఏడో రౌండ్ దౌత్య చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికే పాంగోంగ్ సరస్సు వద్ద నుంచి ఇరు దేశాలకు చెందిన సైనికులు వెనక్కు వచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిపోయిన సమస్యల పరిష్కారంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

వాస్తవాధీన రేఖ  పశ్చిమ సెక్టార్ వద్ద పరిస్థితిని సమీక్షించినట్టు భారత వర్గాలు చెబుతున్నాయి. పాంగోంగ్ సరస్సు వద్ద మోహరించిన బలగాలు వెనక్కి వచ్చేయడంతో మిగిలిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని అంటున్నాయి. 11వ రౌండ్ సీనియర్ కమాండర్ స్థాయి చర్చలకు ఓకే చెప్పినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. త్వరలోనే చర్చలకు సంబంధించిన తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది.

మిగతా ఘర్షణ ప్రాంతాల్లో వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణకు కృషి చేస్తామని వెల్లడించింది. మాస్కో ఒప్పందానికి కట్టుబడేలా అంగీకారం కుదిరిందని తెలిపింది. పరస్పర ఆమోదం వచ్చే పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు నిర్ణయించామని పేర్కొంది. అయితే, ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు సమస్యలు దెబ్బ తీయకూడదని చైనాకు భారత్ తేల్చి చెప్పింది.


రెండు దేశాల మధ్య మొహమాటం లేకుండా ఎవరి అభిప్రాయాలను వారు తేల్చి చెప్పారని చైనా అంటోంది. ‘‘సార్క్ సదస్సులో భాగంగా రష్యా రాజధాని మాస్కోలో భేటీ అయినప్పుడు జరిగిన ఐదు పాయింట్ల ఒడంబడికను అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది.  ఫిబ్రవరి 25న ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడూ మాస్కో ఒప్పందాన్ని అమలు చేయాలని తీర్మానించాం. సరిహద్దుల్లో పరిస్థితులను స్థిరీకరించే ప్రయత్నం చేసేందుకు కృషి చేస్తాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం పూర్తిగా పోయేందుకు అతి త్వరలోనే మరోసారి సీనియర్ కమాండర్ స్థాయి చర్చలు ఉంటాయి’’ అని చైనా ప్రకటించింది.  

More Telugu News