Bhumika: నాగార్జున సినిమాలో కీలక పాత్రలో భూమిక!

Bhumika Chawla to play key role in Nagarjunas film
  • నాగార్జున కథానాయకుడుగా 'బంగార్రాజు'
  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా 
  • నెగటివ్ టచ్ తో సాగే పాత్రలో భూమిక
  • వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల  
గతంలో 'ఖుషీ' సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కథానాయిక భూమిక. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో పలు సినిమాలు చేసి అగ్రకథానాయికగా కూడా రాణించింది. అటు గ్లామర్ నాయికగా.. ఇటు అభినయం ప్రదర్శించగల నటిగా కూడా పేరుతెచ్చుకుంది. అప్పట్లోనే అక్కినేని నాగార్జునతో 'స్నేహమంటే ఇదేరా' సినిమాలో కథానాయికగా నటించింది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు నాగార్జున సినిమాలో భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది.

ఆమధ్య నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలోని బంగార్రాజు పాత్ర బాగా పాప్యులర్ అయింది. దాంతో ఆ పాత్ర పేరునే టైటిల్ గా తీసుకుని నాగార్జున మరో సినిమా చేస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' దర్శకుడు కల్యాణ్ కృష్ణ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ 'బంగార్రాజు' చిత్రంలో ఓ కీలక పాత్రకు భూమికను ఎంపిక చేసినట్టు, ఆమె పాత్ర నెగటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Bhumika
Nagarjuna
Kalyan Krishna

More Telugu News