Jr NTR: ఇప్పుడు కాదు.. త‌ర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం: రాజకీయాలపై ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం

  • జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు'
  • మీడియా సమావేశంలో మాట్లాడిన ఎన్టీఆర్
  • రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి అడిగిన జ‌ర్న‌లిస్టు
  •  సమయం, సందర్భం కాదన్న ఎన్టీఆర్  
I will try to my level best in Evaru Meelo Koteeswarulu Jr NTR

జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' షోతో వ్యాఖ్యాత‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ షో ప్రోమో విడుద‌ల సంద‌ర్భంగా  మీడియా స‌మావేశంలో మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా ఓ జ‌ర్న‌లిస్టు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ప్ర‌శ్నిస్తూ... 'రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఒకవేళ మీ అభిమానులు అడిగితే మీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఎప్పుడు ఉంటుంది?'  అని అడిగాడు.

దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ... 'దీనికి ఆన్స‌ర్ మీకే తెలిసి ఉంటుంది. పోనీ మీరే చెప్పండి.. మీరు ఆన్స‌రు చెప్పండి. ఎన్నిసార్లు మీడియా స‌మావేశంలో కూర్చున్నారు.. దీనికి ఆన్స‌రు మీరే చెబితే బాగుంటుంది' అని ఎన్టీఆర్ అన్నాడు.

దీనికి ఆ జ‌ర్న‌లిస్టు స్పందిస్తూ... 'మీరు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల్లోకి వ‌స్తే బాగుంటుంద‌'ని అన్నాడు.

ఎన్టీఆర్ మ‌ళ్లీ స్పందిస్తూ... 'నా ఆన్స‌ర్ ఏంటో మీరే చెప్పండి అంటున్నాను.. ఇది స‌మయం కాదు. సంద‌ర్భం కాదు. త‌ర్వాత తీరిగ్గా ఒక‌రోజు మంచి వేడివేడి కాఫీ తాగుతూ దీనిపై క‌బుర్లు చెప్పుకుందాం. ఇది స‌మ‌యం కాదు, సంద‌ర్భంగా కాదు.  దాని గురించి త‌ర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం' అని ఎన్టీఆర్ చెప్పాడు.

బిగ్‌బాస్ త‌ర్వాత ఎవరు మీలో కోటీశ్వ‌రులు షోలో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి ప్ర‌త్యేకంగా ఎలాంటి కార‌ణాలు లేవ‌ని సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ చెప్పాడు.  'సినిమా విష‌యానికి వ‌స్తే క‌థ‌, క‌థ‌నాలు న‌చ్చుతాయి.. చేసుకుంటూ వెళ్లిపోతాం. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు షో ల‌క్ష్యం ఏమిటంటే.. చాలా మందితో సంభాషిస్తూ వారి జీవితంలో ఎదుర్కొన్న విష‌యాల‌ను తెలుసుకోవడమే. ఆయా విష‌యాల‌ను తెలుసుకోవాల‌ని నాలో ఆస‌క్తి ఉంది. ఈ షోకు ఒప్పుకున్నాను. నాగార్జున గారు, చిరంజీవిగారు ఈ షోకి ఒక మార్క్ క్రియేట్ చేశారు. నా వంతు కృషి చేసి ఓ మార్కును క్రియేట్ చేయ‌డానికి నేనూ కృషి చేస్తాను' అని జూనియ‌ర్ ఎన్టీఆర్ చెప్పారు.

బిగ్ బాస్ త‌ర్వాత ప్ర‌జ‌లంద‌రితో మ‌ళ్లీ మ‌మేకం అవ‌డానికి బుల్లి తెర‌పైకి రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని ఎన్టీఆర్ చెప్పాడు. ప్రేక్ష‌క దేవుళ్లంద‌రూ త‌న కొత్త ప్రయ‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తారని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఈ షోలో కంప్యూట‌ర్ ఉంటుంద‌ని తాను అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు త‌న‌కు కూడా తెలియ‌వ‌ని చెప్పాడు.

More Telugu News