Kollywood: మ‌న‌ల్ని వేధించిన వారి పేర్ల‌ను బయటపెట్టడం నేరంకాదు: ‘ఇండియాటుడే కాన్‌క్లేవ్‌’లో గాయ‌ని చిన్మ‌యి

  • రాధారవి, వైరముత్తు త‌న‌పై బ్యాన్ విధించార‌ని వెల్ల‌డి
  • వారు మాత్రం సమాజంలో మంచి పేరుతో జీవిస్తున్నార‌ని వ్యాఖ్య‌
  • టాలీవుడ్, బాలీవుడ్‌లో చాన్సులున్నాయన్న గాయ‌ని
chinmayi allegations on kollywood

ప్రముఖ గాయని చిన్మయి గ‌తంలో ‘మీటూ’ ఆరోపణలు చేసి సంచ‌ల‌నం రేపిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడినందుకు ఆమెకు చాలా మంది మ‌ద్ద‌తు తెల‌ప‌గా, ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు మాత్రం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

చివ‌ర‌కు త‌న‌ను కోలీవుడ్‌ నిషేధించిందని చిన్మయి తాజాగా చెప్పింది. ‘ఇండియాటుడే కాన్‌క్లేవ్‌’లో ఆమె మాట్లాడుతూ...  2018 అక్టోబర్‌ నుంచే రాధారవి, వైరముత్తు వంటి వారు కోలీవుడ్‌ లో త‌నను నిషేధించార‌ని వివ‌రించింది. రాధారవి నాయకత్వంలోని డబ్బింగ్ యూనియన్ త‌న‌ను నిషేధించడంతో దానిపై తాను చట్టబద్ధంగా పోరాడుతున్నానని చెప్పింది.

మ‌న‌ల్ని వేధించిన వారి పేర్ల‌ను బయటపెట్టడం నేరం కాదని తెలిపింది. ఆరోపణలు ఉన్న వైరముత్తు, రాధారవి మాత్రం సమాజంలో మంచి పేరుతో హాయిగా జీవిస్తున్నార‌ని ఆమె చెప్పింది. భ‌గ‌వంతుడి దయ వల్ల తాను టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని‌ చేస్తూ బ‌తుకుతున్నాన‌ని తెలిపింది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అర్థం చేసుకుని త‌న‌ వెన్నంటే ఉండే భర్త త‌న‌కు దొరకడం తన అదృష్టమని ఆమె చెప్పారు. అయితే, తనకున్నటువంటి అర్థం చేసుకునే భ‌ర్త‌, కుటుంబం లేని మహిళల పరిస్థితి ఏంట‌ని ఆమె నిల‌దీసింది.

More Telugu News