Mumbai: మాస్కులను పక్కనపెట్టేసిన ముంబై ప్రజలు.. ఒక్క రోజులో రూ. 48 లక్షల జరిమానా వసూలు చేసిన బీఎంసీ

  • గురువారం ఒక్క రోజే పట్టుబడిన 24,226 మంది
  • ఏడాది కాలంలో 18,45,777పై చర్యలు
  • మొత్తంగా రూ. 37 కోట్లకుపైగా జరిమానా రూపంలో వసూలు
BMC fine Rs 48 lakhs for not wearing mask

కరోనా వైరస్ మళ్లీ చెలరేగిపోతున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కనీస జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు. పెరుగుతున్న కేసులతో మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్న ముంబైలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కొరడా ఝళిపించిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తోంది.

గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టిన తనిఖీల్లో మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన 24,226 మంది నుంచి ఏకంగా రూ.48.45 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేసింది. కాగా, గతేడాది ఏప్రిల్ 20 నుంచి ఇప్పటి వరకు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న 18,45,777 మంది నుంచి రూ. 37,27,45,600 వసూలు చేసినట్టు బీఎంసీ తెలిపింది.

More Telugu News