Kruti Sanon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kruti Sanon will join Adipurush next month
  • 'ఆదిపురుష్'కు కృతిసనన్ డేట్స్   
  • ఈద్ పండుగ సమయంలో విక్రమ్ కోబ్రా 
  • కార్తికేయ సినిమాకి సుకుమార్ కథ  
*  ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతిసనన్ నటిస్తున్నట్టు నిన్న అధికారిక ప్రకటన వచ్చిన సంగతి విదితమే. ఇక ఆమె ఈ చిత్రం షూటింగులో వచ్చే నెలలో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె మే నెలాఖరు వరకు వరుసగా 45 రోజుల పాటు షూటింగ్ చేస్తుందట.
*  ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ తాజాగా 'కోబ్రా' చిత్రంలో నటిస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈద్ పండుగ సమయంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.    
*  తాజాగా 'చావు కబురు చల్లగా' చిత్రంలో నటించిన హీరో కార్తికేయ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ బ్యానర్లో చేయనున్నాడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలను కూడా సుకుమార్ సమకూరుస్తాడట. దర్శకుడు ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారు.
Kruti Sanon
Prabhas
Vikram
Sukumar

More Telugu News