ఘనంగా నటి మెహ్రీన్ నిశ్చితార్థం.. త్వరలోనే వివాహం
- హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్యతో నిశ్చితార్థం
- ఈ ఏడాదే వివాహమని చెప్పిన మెహ్రీన్ తల్లి
- వేడుక ఫొటోలను పంచుకున్న మెహ్రీన్
నిశ్చితార్థం అనంతరం మెహ్రీన్ తల్లి పమ్మి పిర్జాదా మాట్లాడుతూ నేడు చాలా గొప్ప రోజని అన్నారు. ఈ ఏడాదే వారి వివాహం జరుగుతుందని, అయితే ఎప్పుడనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.
'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఎఫ్-2, కవచం, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమాలో నటిస్తోంది.