Nikhileswar: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన... తెలుగులో నిఖిలేశ్వర్ కు పురస్కారం

  • 20 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు
  • నిఖిలేశ్వర్ కు విశిష్ట గుర్తింపు
  • దిగంబర కవుల్లో ఒకరిగా ఖ్యాతిపొందిన నిఖిలేశ్వర్
  • వీరప్ప మొయిలీకి అవార్డు
Telugu poet Nilkhileswar gets Sahithya Academy Award

ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను నేడు ప్రకటించారు. 20 మందికి సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. తెలుగులో నిఖిలేశ్వర్ ను ఈ ఉన్నతస్థాయి పురస్కారం వరించింది. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదగిరిరెడ్డి. ఆయన కలం పేరు నిఖిలేశ్వర్. దిగంబర కవుల్లో ఒకరిగా పేరుపొందారు. ఇక, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం అనే గ్రంథం మొయిలీకి ఈ అవార్డు తెచ్చిపెట్టింది.

అరుంధతి సుబ్రమణియమ్, హరీశ్ మీనాక్షి, అనామిక, ఆర్ఎస్ భాస్కర్, ఇరుంగ్ బమ్ దేవేన్, రూప్ చంద్ హన్స్ దా, నందా ఖారే, మహేశ్ చంద్ర శర్మ గౌతమ్, ఇమైయ్యం, హుస్సేన్ అల్ హక్, అపూర్బా కుమార్ సైకియా, ధరిందర్ ఒవారి, హిదాయ్ కౌల్ భారతి (మరణానంతరం), కామకాంత్ ఝా, గుర్దేవ్ సింగ్ రుపానా, గ్యాన్ సింగ్, జీతో లాల్వానీ, మణిశంకర్ కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

More Telugu News