Team India: తొలి టీ20.. ఫస్ట్ బ్యాటింగ్ ఇండియాదే!

  • అహ్మదాబాద్ లో తొలి టీ20
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • తొలి రెండు మ్యాచ్ లకు రోహిత్ శర్మ దూరం
England win toss against India in first T20

ఇంగ్లండ్-ఇండియాల తొలి వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టీమిండియా జట్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మకు తొలి రెండు మ్యాచులకు విశ్రాంతిని కల్పించారు. ఇరు తుది జట్ల వివరాలు ఇవే.

ఇండియా: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్.

ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (కీపర్), మలాన్, బెయిర్ స్టో, మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, రషీద్, మార్క్ వుడ్.

ఇక పిచ్ విషయానికి వస్తే... ఇదే స్టేడియంలో జరిగిన టెస్టులను ఎర్రమట్టి పిచ్ లపై ఆడారు. టీ20లకు నల్లమట్టి పిచ్ లను వాడుతున్నారు. ఈ పిచ్ హార్డ్ గా ఉంటుంది. మణికట్టు మాయాజాలం ప్రదర్శించే స్పిన్నర్లకు ఈ పిచ్ లాభించే అవకాశం ఉంది. ఆట గడిచేకొద్దీ ఔట్ ఫీల్డ్ వేగంగా మారుతుంది. ఎక్కువ రన్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News