KCR: యాదాద్రి లైటింగ్ పై డెమో వీడియో తిలకించిన సీఎం కేసీఆర్

KCR watch Yadadri lighting demo video
  • యాదాద్రి క్షేత్రంలో భారీస్థాయిలో పునర్నిర్మాణ పనులు
  • సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ 
  • పలు సూచనలు చేసిన సీఎం
  • మే నెలలో యాదాద్రి క్షేత్రం పునఃప్రారంభం!
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రదర్శించిన యాదాద్రి క్షేత్రం లైటింగ్ పై డెమో వీడియోను తిలకించారు. దీనిపై పలు సూచనలు చేశారు. గడువులోగా తుదిమెరుగులు దిద్దే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 నాటికి క్యూలైన్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 350 సీట్ల క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని సూచించారు. ప్రపంచ దేవాలయాల్లో యాదాద్రి తన ప్రత్యేకతను చాటుకోబోతోందని అన్నారు. కాగా మే నెలలో యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభించే అవకాశం ఉన్నట్టు సీఎం కేసీఆర్ అధికారులతో సూచనప్రాయంగా తెలిపారు.
KCR
Yadadri
Temple Lighting
Demo Video

More Telugu News