Jagan: మాచర్లలో పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిసిన సీఎం జగన్.. కుమార్తెకు సత్కారం!

CM Jagan met daughter of Pingali Venkaiah
  • భారత జాతీయ పతాకానికి వందేళ్లు
  • నాడు త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య
  • మాచర్లలో నివసిస్తున్న పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి
  • సీతామహాలక్ష్మి నివాసంలో సీఎం సందడి
భారత జాతీయ పతాకాన్ని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించడం మనందరికీ గర్వకారణం. కాగా, త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించి 100 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ నేడు పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఆమెను సీఎం ఘనంగా సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కున్నారు.

ఈ సందర్భంగా పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయగా, సీఎం ఆసక్తిగా తిలకించారు. ఇక, సీఎం జగన్ స్వయంగా తమ నివాసానికి రావడం పట్ల పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Jagan
Pingali Venkaiah
Ghantasala Seethamahalakshmi
Tri Colour Flag
Macherla
Guntur District

More Telugu News