Dethadi Harika: హారిక ఎవరో నాకు తెలియదు.. మరో సెలబ్రిటీని టూరిజానికి అంబాసిడర్‌గా నియమిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Tourism minister Srinivas Goud Responds about Dethadi Harika
  • హారిక నియామకంపై విచారణ చేయిస్తాం
  • దీని వెనకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
  •  హారికను తొలగించారన్న వార్తను ఖండించిన పర్యాటక శాఖ చైర్మన్
యూట్యూబ్ ద్వారా పాప్యులర్ అయిన దేత్తడి హారికను తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హారిక ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల బిజీలో ఉన్నానని పేర్కొన్నారు. హారిక నియమాకంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని, దీని వెనక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో సెలబ్రిటీని పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని అన్నారు.

మరోవైపు, పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను తొలగించారంటూ వస్తున్న వార్తను టూరిజం శాఖ  చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఖండించారు. తక్కువ ఖర్చుతో రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం చేసేందుకే హారికను ఎంపిక చేశామని చెప్పారు. పర్యాటక మంత్రి అనుమతితో టూరిజం బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మహేశ్ బాబు వంటి హీరోలతో ప్రచారం చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, హారికతో అయితే తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేయించుకోవచ్చని తెలిపారు.
Dethadi Harika
You Tube
Tourism
Telangana
Brand Ambassador

More Telugu News