Dethadi Harika: మహేశ్ బాబు లాంటి వాళ్లకు కోట్లు ఖర్చవుతుంది.. అందుకే హారిక నియామకం: శ్రీనివాస్ గుప్తా

We cant pay stars like Mahesh Babu thats why appointed Dethadi Harika as brand ambassador says Srinivas Gupta
  • తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారిక నియామకం 
  • ఆ తర్వాత ఆమెను తొలగించినట్టు వార్తలు
  • తొలగించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న శ్రీనివాస్ గుప్తా
బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికను తెలంగాణ ప్రచారకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెను తొలగించారంటూ ఆ తర్వాత వార్తలు వచ్చాయి. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని... తనకు, సీఎంఓకు తెలియకుండా ఎలా నియమిస్తారని టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో ఆమెను నియమించిన టూరిజం శాఖ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హారికను తొలగించారంటూ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. తక్కువ ఖర్చుతో రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం చేసేందుకే హారికను ఎంపిక చేశామని చెప్పారు.

ఈ విషయంపై గతంలోనే పర్యాటక మంత్రి అనుమతితో టూరిజం బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మహేశ్ బాబు వంటి హీరోలతో ప్రచారం చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. అందుకే యూట్యూబ్ ద్వారా పేరుగాంచిన హారికను ఎంపిక చేశామని చెప్పారు. హారిక అయితే తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేయించుకోవచ్చని తెలిపారు.
Dethadi Harika
Bigg Boss
Telangana Tourism
Brand Ambassador
Mahesh Babu

More Telugu News