Nimmagadda Ramesh Kumar: విజయవాడలో పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించిన నిమ్మ‌గ‌డ్డ‌

nimmagadda meets voters
  • కొన‌సాగుతోన్న మునిసిప‌ల్ ఎన్నిక‌లు
  • ప‌లువురు అధికారుల‌తో క‌లిసి నిమ్మ‌గ‌డ్డ ప‌రిశీల‌న‌
  • ఓట‌ర్లతో మాట్లాడిన ఎస్ఈసీ
ఆంధ్రప్ర‌దేశ్‌లో మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు అధికారుల‌తో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ఈ రోజు విజయవాడలోని వివిధ పోలింగ్ బూత్‌లను ప‌రిశీలిస్తున్నారు.

పోలింగ్ జ‌రుగుతోన్న తీరుపై ఆయ‌న అధికారుల‌తో పాటు ఓట‌ర్ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్ బూత్ ల‌ వద్ద అన్ని ర‌కాలుగా ప్ర‌త్యేక‌ ఏర్పాట్లు చేశామని ఆయ‌న‌కు అధికారులు చెప్పారు. పలు చోట్ల‌ ఎస్‌ఈసీకి ఓటర్లు కొన్ని ఫిర్యాదులు చేశారు.

విజయవాడలో రాజకీయంగా చైతన్యం ఉందని ఈ సందర్భంగా నిమ్మ‌గ‌డ్డ అన్నారు. ఆ ప్రాంతంలో పోలింగ్ శాతం ఈసారి పెరుగుతుందని తెలిపారు. క‌రోనా సోకిన వారు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు ఆఖరి గంటలో రావాల‌ని సూచించారు. క‌రోనా డెస్క్ తో పాటు హెల్త్ డెస్క్‌లను నిమ్మ‌గ‌డ్డ‌ పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఓట్లు వేసేందుకు వ‌చ్చిన వృద్ధుల‌ను ఆయ‌న అభినందించారు. వారు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నార‌ని కొనియాడారు.
Nimmagadda Ramesh Kumar
Andhra Pradesh
Local Body Polls

More Telugu News