'కేజీఎఫ్' స్టార్ యశ్ తల్లిదండ్రులకు, గ్రామస్థులకు మధ్య వివాదం.. పోలీసుల జోక్యం
- హాసన్ జిల్లాలో యశ్ కు వ్యవసాయ క్షేత్రం
- ఆ భూమికి రోడ్డును నిర్మించే క్రమంలో గొడవ
- పరిస్థితిని చక్కదిద్దిన అభిమానులు, పోలీసులు
అయితే, ఆ భూమికి రోడ్డును నిర్మించే క్రమంలో యశ్ తల్లిదండ్రులకు, గ్రామంలోని కొందరికి మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ముదిరి పెద్ద గొడవగా మారింది. దీంతో, యశ్ అభిమానులు కొందరు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందడంతో... వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించారు.