Home Guards: వైఎస్ షర్మిలను సాయం కోరిన హోంగార్డులు

Telangana home guards met YS Sharmila
  • తెలంగాణలో హోంగార్డులుగా పనిచేస్తున్న ఆంధ్రులు 
  • లోటస్ పాండ్ లో షర్మిలతో సమావేశం
  • తమను స్థానికేతరులుగానే భావిస్తున్నారని ఆవేదన 
  • ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని విన్నపం

కొత్త పార్టీ ప్రారంభించేందుకు తహతహలాడుతున్న వైఎస్ షర్మిల వరుస సమావేశాలతో జోరు ప్రదర్శిస్తున్నారు. తాజాగా షర్మిలను కొందరు హోంగార్డులు హైదరాబాదులోని లోటస్ పాండ్ లో కలిశారు. ఆ హోంగార్డులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాగా, తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, తమను ఏపీలో విధుల్లోకి తీసుకునే విధంగా జగన్ ప్రభుత్వంతో మాట్లాడాలని వారు షర్మిలను కోరారు.

తెలంగాణలో హోంగార్డులుగా పనిచేస్తున్నప్పటికీ తమను స్థానికేతరులుగానే భావిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఆప్షన్లు తమకు ఇవ్వలేదని వారు వాపోయారు. తమ సమస్యను ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ఆ హోంగార్డులు చేసిన విజ్ఞప్తికి షర్మిల స్పందించారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News