Arvind: బాలీవుడ్ మత్తు నుంచి కేటీఆర్ బయటకు రావాలి: అరవింద్

KTR should come out from Bollywood kick says Arvind
  • ప్రణాళిక ప్రకారమే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి
  • మత్తులో కేసీఆర్ మతాన్ని కూడా మర్చిపోయారు
  • భూకబ్జాల్లో కేటీఆర్ ను కవిత మించిపోయారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో మరోసారి హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాల మధ్య వరుసగా హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, ఒక ప్రణాళిక ప్రకారమే భైంసాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ హింసకు పాల్పడిన అల్లరిమూకకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకి మద్దతు ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలకు లేఖ రాస్తానని చెప్పారు. భైంసా అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ బాలీవుడ్ మత్తులో మునిగిపోయారని... ఆ మత్తు నుంచి ఆయన బయటకు రావాలని అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయారని అన్నారు. ఓట్ల కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. మత్తులో మునిగితేలుతున్న కేసీఆర్ తన మతాన్ని కూడా మర్చిపోయారని అన్నారు.  భూకబ్జాల్లో కేటీఆర్ ను కవిత మించిపోయారని విమర్శించారు. హోం మంత్రి మహమూద్ చేతకాని స్థితిలో ఉన్నారని... లా అండ్ ఆర్డర్ తమకు అప్పచెపితే అల్లర్లను ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపిస్తామని చెప్పారు.
Arvind
Bhainsa
KCR
KTR
TRS
Bollywood

More Telugu News