అధునాతన మాస్క్ రూపొందించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.. పార్లమెంట్‌లో హైలైట్!

09-03-2021 Tue 08:13
  • పలు రకాల మాస్కులు, శానిటైజర్లు తయారు చేసిన విశ్వేశ్వరరెడ్డి
  • హైఎఫిషియన్సీ మాస్క్ ధరించి పార్లమెంటుకు హాజరైన నరేంద్ర జాదవ్
  • ఆరా తీసిన ఇతర సభ్యులు
Rajya Sabha MP Narendra Jadhav wears High Efficiency Particulate Air filter mask in Parliament

తెలంగాణలోని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అభివృద్ధి చేసిన మాస్క్ నిన్న పార్లమెంటులో అందరి దృష్టినీ ఆకర్షించింది. సాధారణ మాస్క్‌కు భిన్నంగా ఉన్న ఈ హైఎఫిషియన్సీ మాస్క్‌ను ధరించి రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. దానిని చూసిన ఇతర సభ్యులు ఆశ్చర్యపోయారు. స్వతహాగా ఇంజినీర్ అయిన విశ్వేశ్వరరెడ్డి కరోనా సమయంలో పలు రకాల మాస్కులు,శానిటైజర్లు, వెంటిలేటర్లు రూపొందించారు. అందులో ఒకటే ఇది.

నరేంద్ర జాదవ్ ధరించిన మాస్క్‌ను చూసిన ఇతర సభ్యులు దాని గురించి ఆరా తీశారు. ఇది 99.07 శాతం శుద్ధమైన ఆక్సిజన్‌ను అందిస్తుందని, దీనిని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రూపొందించారని ఆయన వారికి వివరించారు.