అనంతపురం జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

09-03-2021 Tue 07:34
  • గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో ఘటన
  • విషపు గుళికలు తిని కుటుంబం ఆత్మహత్య
  • కారణాలపై పోలీసుల ఆరా
three in a family died by suicide in anantapur district

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. గార్లదిన్నె మండలంలోని ఎర్రగుంట్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.  గ్రామానికి చెందిన రామకృష్ణ (43), ఆయన భార్య రాజేశ్వరి (38), కుమారుడు దేవేంద్ర (14) విషపు గుళికలు తినడం ద్వారా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.