సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

09-03-2021 Tue 07:25
  • వెరైటీ ప్రేమకథా చిత్రంలో అనుష్క 
  • మళ్లీ దుబాయ్ లో మహేశ్ షూటింగ్
  • 'గోల్డ్ మాన్'గా రానున్న సంపూ  
Anushka gives nod for a love story

*  ప్రముఖ నటి అనుష్క శెట్టి తాజాగా ఓ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం గమ్మత్తయిన ప్రేమకథగా సాగుతుందట. నలభై ఏళ్ల వయసున్న అనుష్కను పాతికేళ్ల కుర్రాడు ప్రేమించడం అనేది ఈ కథగా చెబుతున్నారు. ఇందులో ఆ యువకుడిగా నవీన్ పోలిశెట్టి నటిస్తాడట.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగు కూడా దుబాయ్ లోనే జరుగుతుంది. ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 15 వరకు దుబాయ్ లో నిర్వహించే ఈ షూటింగులో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
*  బర్నింగ్ స్టార్ గా పేరుతెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు త్వరలో మరో సినిమాలో హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం 'క్రేజీ అంకుల్స్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కిరణ్ తలాసియా దీనికి దర్శకత్వం వహిస్తాడు. 'గోల్డ్ మాన్' పేరిట ఈ చిత్రం పిరీడ్ మూవీగా తెరకెక్కుతుందని తెలుస్తోంది.